Wednesday, September 23, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుయూపీఐ సేవలపై చార్జీల వడ్డన దుర్మార్గం

యూపీఐ సేవలపై చార్జీల వడ్డన దుర్మార్గం

- Advertisement -

కేంద్రం నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి
సామాన్యులపై భారం పడదంటూ ఆర్థిక మంత్రి పచ్చి అబద్ధాలు
రూ. 2వేలు దాటిన లావాదేవీలపై ఎండీఆర్‌ భారం
ఉపసంహరించుకోకపోతే పోరాటం ఉధృతం :
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు టి.జ్యోతి డిమాండ్‌
గోల్కొండ చౌరస్తా నుంచి ఆర్టీసీ క్రాస్‌‌రోడ్డు వరకు 
సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన

నవతెలంగాణ-సిటీబ్యూరో
యూపీఐ సేవలపై అక్టోబర్‌ 15 నుంచి మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌(ఎండీఆర్‌) పేరిట చార్జీలు వసూలు చేయాలన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్ణయం అత్యంత దుర్మార్గమైనదని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు టి.జ్యోతి ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 2 వేలు దాటిన లావాదేవీలపై చార్జీలు మోపే కుట్రలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ(ఎం) గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం గోల్కొండ చౌరస్తా నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ వరకు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ వద్ద పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.మహేందర్‌ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో టి.జ్యోతి మాట్లాడారు. ఎండీఆర్‌ వల్ల సామాన్యులపై భారం పడదని, వ్యాపారులే ఆ చార్జీలను భరిస్తారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పడం పచ్చి మోస మన్నారు.వ్యాపారస్తులెవరూ తమ జేబుల నుంచి చార్జీలు చెల్లించరని, వస్తు సేవల ధరలు పెంచి ప్రజలపైనే ఆ భారాన్ని మోపుతారని స్పష్టం చేశారు. 2016లో పెద్ద నోట్ల రద్దు సమయంలో ‘డిజిటల్‌ ఇండియా’ పేరుతో ప్రజలందరినీ ఆన్‌లైన్‌ లావా దేవీల వైపు నెట్టి, అవి ప్రజల నిత్య జీవితంలో భాగమయ్యాక చార్జీలు వసూలు చేయడం కార్పొ రేట్‌ శక్తులకు మేలు చేయడానికేనని విమర్శిం చారు. ఇప్పటికే పెట్రోల్‌, డీలర్ల అసోసియేషన్‌ ఆన్‌లైన్‌ లావా దేవీలను నిరాకరిస్తూ నగదు రూపం లోనే చెల్లిం చాలని కోరుతున్న విషయాన్ని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల దేశం మళ్లీ నగదు ఆధారిత ఆర్థిక వ్యవస్థ(క్యాష్‌ ఎకానమీ) వైపు మళ్లే ప్రమాదం ఉందని హెచ్చరిం చారు. ప్రజలకు బ్యాంకింగ్‌ వ్యవస్థను పూర్తి ఉచితంగా అందు బాటులో ఉంచాలని, లేనిపక్షంలో దేశవ్యా ప్తంగా పెద్ద ఎత్తున ప్రజాపోరాటాలు నిర్మిస్తామని హెచ్చరించారు.

​అమెరికా కంపెనీల కోసమే కేంద్రం పాకులాట
దేశంలో యూపీఐ లావాదేవీల్లో రూ.2 వేలు దాటినవే దాదాపు 65 శాతం ఉన్నాయని సీపీఐ(ఎం) గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.వెంకటేష్‌ తెలిపారు. కేంద్రం తాజా నిర్ణయంతో రూ.50 వేలు దాటిన లావాదేవీలకు రూ.200, రూ.75 వేలు దాటితే రూ.300 వరకు చార్జీలు చెల్లించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. నోట్ల ముద్రణ కోసం ప్రభుత్వం ఏటా రూ. 4,875 కోట్లు ఖర్చు చేస్తుండగా, ఆన్‌లైన్‌ సేవలకు కేటాయిస్తున్నది రూ. 2,183 కోట్లు మాత్రమేనని వివరించారు. స్వతంత్ర భారతంలో ఎన్నడూ నోట్ల ముద్రణకు ప్రజల నుంచి పన్ను వసూలు చేయని పాలకులు, ఆన్‌లైన్‌ సేవలపై ఎందుకు పన్నులు విధిస్తున్నారని ప్రశ్నించారు. ఆన్‌లైన్‌ లావాదేవీల్లో దాదాపు 83 శాతం వాటా కలిగిన గూగుల్‌ పే, ఫోన్‌ పే వంటి అమెరికా బహుళజాతి కంపెనీలకు లాభాలు చేకూర్చేందుకే మోడీ ప్రభుత్వం ఈ ఎండీఆర్‌ చార్జీలను రుద్దుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
ఈ నిరసన ప్రదర్శన సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్‌.అరుణ జ్యోతి, నగర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.శ్రీనివాసరావు, కె.నాగలక్ష్మి, నగర కమిటీ సభ్యులు ఆర్‌.వెంకటేష్‌, జె.కుమారస్వామి, పద్మ, జి.నరేష్‌, జి.కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -