- Advertisement -
అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
చేయూత పథకం కింద కొత్త పింఛన్లను దసరాలోపు లబ్ధిదారులకు అందజేసేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క మంగళవారం సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్‌ను ఆదేశించారు. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించి దసరాలోపు క్షేత్రస్థాయి వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. కాగా చేయూత పథకంలోని అన్ని కేటగిరీలకు కాకుండా ఈ సారీ వితంతు, వికలాంగులు, గీత, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, డయాలసిస్, ఫైలేరియా బాధితులు అనే ఏడు రకాల వారికి మాత్రమే పింఛన్లను అందించనున్నారు.
- Advertisement -



