Wednesday, September 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయందోస్త్ స్పాట్ అడ్మిషన్ షెడ్యూల్ విడుదల

దోస్త్ స్పాట్ అడ్మిషన్ షెడ్యూల్ విడుదల

- Advertisement -

తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మెన్, కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
డిగ్రీలో చేరేందుకు దోస్త్ స్పాట్ అడ్మిషన్ షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు మంగళవారం తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మెన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఎ.శ్రీదేవసేన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 23న ఆయా కాలేజీల్లో ఉన్న ఖాళీల వివరాలను నోటీస్ బోర్డుల్లో పెడతారు. 24, 25 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లను తీసుకుంటారు. 26న అడ్మిషన్ల వివరాలను ఆయా కాలేజీలు పోర్టల్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఈ నెల 28, 29 తేదీల్లో స్పెషల్ స్పాట్ అడ్మిషన్ చేపడతారు. వీటి వివరాలను ఈ నెల 30న పోర్టల్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం ఆసక్తి కలిగిన అభ్యర్థులు దోస్త్ వెబ్ సైట్ లో చూడొచ్చు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -