వికలాంగులకు 100% రాయితీతో బ్యాంకు రుణాలు ఇవ్వాలి

నవతెలంగాణ – చివ్వేంల
వికలాంగులు స్వయం ఉపాధితో బతికేందుకు 15 లక్షల వరకు 100% రాయితీతో ముఖ్యమంత్రి ప్రభుత్వం బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితిరాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ అన్నారు. శనివారం గుంపుల గ్రామంలో వికలాంగుడు మున్న మధు యాదవ్ భవాని దంపతులు నూతనంగా ఏర్పాటు చేసుకున్న శ్రీ తనవి కిరాణా షాపు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ రిబ్బన్ కట్ చేసి షాప్ ను ప్రారంభించి  మాట్లాడారు. పుట్టుకతోనే శారీరక వికలాంగుడి గా  ఉండి ఎన్నో కష్టనష్టాలు అనుభవించి ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ పైనే ఆధారపడి జీవనం వెళ్లదీస్తున్న మున్న మధు యాదవ్ స్వశక్తితో బతికేందుకు నూతనంగా  కిరాణా షాపును ప్రారంభించడం శుభ పరిణామం  అన్నారు. పుట్టుక నుంచి వైకల్యం ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం నుంచి ప్రజా ప్రతినిధులు ఎలాంటి సహకారం అందకున్న తపన ఆసక్తి ఉంటే ఎంతటి విజయన్నైనా అందుకోవచ్చని చిన్నతనం  నుంచి వైకల్యాన్ని ఎదురించి తన కాళ్లపై తానే నిలబడేలా కిరాణా షాప్ ను ఏర్పాటు చేసి  మున్నా మధు యాదవ్ నిరూపించుకున్నాడని అన్నారు.మున్న మధు యాదవ్ లాంటి నిరుపేద వికలాంగులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు పార్టీలు ముందుకు రావాలని మున్న మధు యాదవ్ ను ప్రోత్సహించేందుకు జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి జిల్లా కలెక్టర్ తమ వంతు ఆర్థిక సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో   కొల్లూరి ఈదయ్య బాబు , షేక్ రఫీ, మద్దెల రవీందర్ కుమార్, మున్న కవలమ్మ, మున్న కాశయ్య ,మున్న అశ్విని తదితరులు పాల్గొన్నారు.
Spread the love