Thursday, May 21, 2026
E-PAPER
Homeఆదిలాబాద్నిజాయితీ చాటుకున్న 102 అంబులెన్స్ పైలెట్

నిజాయితీ చాటుకున్న 102 అంబులెన్స్ పైలెట్

- Advertisement -

నవతెలంగాణ – బజార్ హత్నూర్: బజార్ హత్నూర్ మండల కేంద్రానికి చెందిన పడ్వాల్ బసంతి (భర్త: ముకేశ్) అనే 9 నెలల గర్భిణీ మహిళ స్కానింగ్ పరీక్షల కోసం 102 అమ్మఒడి వాహనంలో గుడిహత్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో సుమారు రూ.15 వేల విలువైన వివో సెల్ ఫోన్‌ను వాహనంలో మరిచిపోయారు. విషయాన్ని గమనించిన 102 అంబులెన్స్ పైలెట్ భగత్ నవీన్ కుమార్ నిజాయితీతో స్పందించి, ఆశా వర్కర్ గంగమణి ద్వారా బాధిత కుటుంబానికి సమాచారం అందించారు. అనంతరం సెల్ ఫోన్‌తో పాటు అందులో ఉన్న రూ.100 నగదును కూడా బసంతి కుటుంబ సభ్యుడు సునీల్ సమక్షంలో వారికి అప్పగించారు. ఈ సందర్భంగా స్థానికులు అంబులెన్స్ సిబ్బంది నిజాయితీని అభినందించారు. కార్యక్రమంలో 108 సిబ్బంది రాజారామ్, తరుణ్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -