నవతెలంగాణ – జుక్కల్ : జుక్కల్ మండలంలోని 30 గ్రామ పంచాయతీలకు నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచుల సంఘం మండల అధ్యక్షునిగా ఖండేబల్లూర్ గ్రామపంచాయతీకి చెందిన గ్రామ సర్పంచ్ చాకలి కృష్ణుని గురువారం నాడు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా మండల సర్పంచుల సంఘం అధ్యక్షునిగా ఎన్నికైన చాకలి కృష్ణ మాట్లాడుతూ మండలంలోని గ్రామపంచాయతీల సర్పంచుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తనను నమ్మి మండలంలోని 30 గ్రామాల్లో సర్పంచులు ఏకగ్రీవంగా సంఘం అధ్యక్షునిగా ఎన్నుకోవడం తనకు ఎంతో సంతోషం కలిగిందని నా మీద ఉంచిన నమ్మకానికి సర్పంచుల బాగోగులకు తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని 30 గ్రామాల సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.
మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా చాకలి కృష్ణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



