న్యూఢిల్లీ: పునరుత్పాదన ఇంధన విభాగంలో 13.5 మెగావాట్ సామర్థ్యానికి చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హైటెక్ పైప్స్ వెల్లడించింది. ఈ సామర్థ్యాన్ని డిసెంబర్ 2024 నాటికే చేరాలని నిర్దేశించుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం 8.5మెగావాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని.. దశల వారిగా మరో 5మెగావాట్‌ను జోడించనున్నట్లు తెలిపింది. ఒక్కో మెగావాట్‌కు రూ.5-7 కోట్ల వ్యయం అవుతుందని పరిశ్రమ వర్గాల అంచనా.