కామారెడ్డి జిల్లాలో టెకదారులందరికీ 2016 రూపాయల జీవన భృతి

నవతెలంగాణ -తాడ్వాయి 
కామారెడ్డి జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ధర్నా అనంతరం కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది అనంతరం ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కన్వీనర్ కే చంద్రశేఖర్ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో 670 మంది టేకదారులున్నారు అందరికీ జీవన భృతి ఇస్తానని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఈరోజు కేవలం 170 మందికి మాత్రమే జీవన భృతి ఇస్తున్నారు మిగతా 500 మందికి కూడా జీవన భృతి 2016 రూపాయలు వెంటనే ఇవ్వాలని కోరారు అలాగే కలెక్టర్ గారు కూడా ఇట్టి సమస్యను పరిశీలించి పది రోజుల్లో  టెకదారుల అప్లికేషన్స్ తీసుకొని అందరికీ జీవనభృతి ఇచ్చే విధంగా పనిచేస్తానని హామీ ఇవ్వడం జరిగింది కావున ప్రతి ఒక్క టేకదారు 2016 రూపాయలు జీవనభృతి రాణి ప్రతి ఒక్క టేకదారు మీ మీ అప్లికేషన్లు తీసుకొచ్చి సిఐటియు యూనియన్ సంప్రదించి పెన్షన్ తీసుకోగలరని కోరారు ఈ కార్యక్రమంలో తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్  జిల్లా కోశాధికారి కర్రోల్ల సత్యం టేకదారులు హనుమాన్లు తమ్మల రాములు సాయిలు లక్ష్మణ్ భూపాల్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love