25 నుండి చామల ఎన్నికల ప్రచారం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
సార్వత్రిక ఎన్నికలలో భాగంగా భువనగిరి పార్లమెంటు పరిధిలోని భువనగిరి పార్లమెంటు ఎన్నికల ఇన్చార్జి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొనే ప్రచార కార్యక్రమాల షెడ్యూల్ మంగళవారం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విడుదల చేశారు. తేది 25 గురువారం నకిరేకల్ నియోజకవర్గం రామన్నపేట మండలం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, తుంగతుర్తి నియోజవర్గం మోత్కూరు మండలంలో సాయంకాలం 4 గంటల నుండి 7 గంటల వరకు, ఆలేరు నియోజవర్గం ఆలేరు మండలంలో 7 గంటల నుండి 10 గంటల వరకు, తేది:26 శుక్రవారం భువనగిరి నియోజకవర్గం పోచంపల్లి మండలంలో ఉదయం 10 గంటల నుండి 1 గంటల వరకు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలంలో 4 గంటల నుండి 7 గంటల వరకు, మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండలంలో 7 గంటల నుండి 10 గంటల వరకు, తేది 27 శనివారం ఆలేరు నియోజకవర్గం బొమ్మలరామారం మండలంలో ఉదయం 10 గంటల నుండి 1 గంటల వరకు, జనగాం నియోజవర్గం జనగాం మండలంలో మధ్యాహ్నం 4 గంటల నుండి 7 గంటల వరకు, తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలంలో 7 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఎన్నికల ప్రచారం ఉంటుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొనాలని రాజగోపాల్ రెడ్డి అన్నారు.
Spread the love