బెల్ట్ షాపులను ఎత్తివేసి నాటు సారాను కట్టడి చేయాలి

– పీఓడబ్ల్యు జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
బెల్ట్ షాపులను రద్దుచేసి నాటసారాను కట్టడి చేయాలని పివోడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టరేట్లో బెల్టు దుకాణాలనీ బందు చేయాలని ఎక్సైజ్ సూపర్డెంట్  అసిస్టెంట్ ఆఫీసర్ కు పి ఓ డబల్యు  జిల్లా కమిటీ తరఫున వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వంలో బెల్ట్ షాపులకు విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చి కెసిఆర్ ప్రభుత్వం ప్రజల్ని తాగుడుకు బానిసలుగా మార్చింది అని అన్నారు. ఇందులో ముఖ్యంగా యువత మందుకు బానిసై తమ అమూల్యమైన జీవితాన్ని కోల్పోతున్నారు అని అన్నారు. ఇదే విషయము అనేకసార్లు గత ప్రభుత్వానికి మా సంఘం తరఫున తెలియజేసిన కానీ ఎలాంటి స్పందన లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బెల్ట్ షాపులు ఎ త్తివేస్తామని ఎన్నికల్లో  సీఎం రేవంత్ రెడ్డి అమి ఇచ్చారు.కానీ ఈరోజు వరకు వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు సరి ఇచ్చిన హామీని అమలు చేయలేదు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మధ్యకాలంలో తండాలలో నాటుసారపెట్టి అమ్ముతున్నారు, దీనివల్ల ప్రజల ఆరోగ్యం చెడిపోయి హాస్పిటల్  ఫాలు అవుతున్నారు అని అన్నారు. వెంటనే ఎక్సైజ్ శాఖ వారు స్పందించి బెల్ట్ షాపులు రద్దుచేసి నాటుసారాలను అరికట్టాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యు జిల్లా అధ్యక్షులు మారసాని చంద్రకళ, ఉపాధ్యక్షులు జయమ్మ , కోశాధికారి సూరం రేణుక పాల్గొన్నారు.
Spread the love