ఎన్.హెచ్.ఎం ఉద్యోగుల 3 నెలల వేతనాలు వెంటనే చెల్లించాలి

– ఈనెల18 నుండి నల్ల బ్యాడ్జీలతో నిరసన..
– తెలంగాణ  హెచ్ ఎం ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కవ్వం లక్ష్మారెడ్డి
నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 
వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు మూడు నెలల నుండి జీతాలు ప్రభుత్వం చెల్లించకున్న విధులు నిర్వహిస్తున్న అత్యవసర విభాగాన్ని విస్మరించడం తగదని వెంటనే జీతాలు చెల్లించాలని ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కవ్వం లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. ఎన్ హెచ్ ఎం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో  కోఠిలోని  ఎన్ హెచ్ ఎం కార్యాలయంలో సి ఎఫ్ డబ్ల్యు కమిషనర్ కు   ఎన్ హెచ్ ఎం ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కవ్వం లక్ష్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి బూర నరేష్ కుమార్, 2వ ఏ ఎన్ ఎంల  యూనియన్  రాష్ట్ర అధ్యక్షురాలు పడాల మమత,  ప్రధాన కార్యదర్శి. కోయేరే అనురాధ ,ఆర్ బి ఎస్ కే డాక్టర్లు,  ఫార్మసిస్టులు కలిసి ఆయన మాట్లాడుతూ.  గత మూడు నెలలుగా 17వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎలాంటి జీతభత్యాలు లేకున్నా మేము ప్రయాణం చేస్తూ పనులకు ఆటంకం కల్పించకుండా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్నా ప్రభుత్వం పట్టించికోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఎమ్మెల్యేలు,మంత్రులు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ని కలిసి రెగ్యులరైజ్ చేయడ0తో పాటు జీతాలు, పీఆర్సీ గురించిమా గోడు వెళ్లబోసుకున్నామని వివరించారు.  ఆరు గ్యారంటీలతో పాటు పలు పథకాలకు బడ్జెట్ కేటాయిస్తున్న ప్రభుత్వం ఎన్ హెచ్ ఎం లో పనిచేస్తున్న 17వేల మంది కుటుంబాలు  నెలసరి జీతభత్యాలతో కాలం వెళ్ళదిస్తున్నారని ,ఇందులో ల్యాబ్ టెక్నీషియన్లు, ఏఎన్ఎంలతో సహా  చాలా రకాల క్యాడర్స్ ఉన్నాయని  ఇప్పటికైనా మాకు మూడు నెలల జీతాలతో పాటు మాకు రావాల్సిన 7 నెలల పిఆర్సి బకాయిలు ఇప్పించి మా ఎన్ హెచ్ ఎం కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.  రాష్ట్ర ప్రభుత్వం కింద మేము పనిచేస్తున్నా మమ్మల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఫర్మెంటు ఉద్యోగులకు లెక్కలేనన్ని వరాలు ఇస్తున్నా ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని రకాల అంటూ వ్యాధులను లెక్కచేయకుండా ప్రణలకుర్తికించి పరీక్షలు చేస్తున్న జీతాలు కూడా సరిగా ఇవ్వడంలేదని అలాగైతే మా కుటుంబాలు రోడ్డునపడే ప్రమాదముందని ఆందోళన వ్యక్త పరిచారు.కాంట్రాక్ట్  పదమే తెలంగాణలో ఉండదని చెప్పిన గత ప్రభుత్వం మమ్మల్ని నిర్లక్ష్యం చేసిందని చెబుతూ మేము గత రెండు దశాబ్దాల నుంచి పనిచేస్తున్నామని క్రమబద్దీకరణ చేయపొగ ఎన్నడు  మాకిలాంటి జీతాల సమస్య ఏర్పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు జీతాల కోసం  మూడు నెలల నుంచి వేచి చూశామని, ఓపిక నశించిందని తెలిపారు. వెంటనే 3 నెలల జీతాలు, పీఆర్సీ బకాయిలు చెల్లించాలని లేదంటే ఎన్ హెచ్ ఎం జాయింట్ ఆక్షన్ కమిటీ తరఫున ఎన్ హెచ్ ఎంలో ఉన్న అన్ని క్యాడర్ల ఉద్యోగులం కలిసి ఈనెల18 న బ్లాక్ బ్యాడ్జిలతో నిరసన తెలుపుతామని,ప్రభుత్వం పట్టించుకోకుంటే  25 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తామని ఉద్యోగుల పక్షాన పడాల మమత ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కవిత,మని, హైమవతి,శ్యామల,పద్మ,జ్యోతి, మమదేవి, శైలజ, వసంత,సుప్రియ, సమీ, తిరుమల్ రెడ్డి,మేరీ తో పాటు వివిధ కేడర్లకు సంబంధించిన  70 మంది ఉద్యోగులు  పాల్గొన్నారు.
Spread the love