హైదరాబాద్: తెలంగాణా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రీమియం డి2సి డెయిరీ బ్రాండ్ సిద్స్ ఫార్మ్ పాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. తమ ఎ2 గేదె పాలు, స్కిమ్ మిల్క్, ఏ2 డబుల్ టోన్డ్ గేదె పాల ధరను ప్యాకెట్‌కు రూ.2 పెంచుతున్నట్లు వెల్లడించింది. ఈ సవరించిన ధరలతో 500 మిల్లీ లీటర్ల ఎ2 గేదె పాల ప్యాకెట్ ధర రూ.52కాగా, స్కిమ్ పాల ధర రూ.32గా ఉంటుంది. ఎ2 డబుల్ టోన్డ్ గేదె పాల ధర రూ.42గా, ఎ2 దేశీ ఆవు పాల ధర మాత్రం గతంలో ఉన్నట్లుగానే అర లీటరుకు రూ.75గా ఉంటుందని తెలిపింది. గత కొన్ని నెలలుగా ముడిపాలు ధరలు స్ధిరంగా పెరుగుతుండటం చేత దాదాపు ప్రతి డెయిరీ బ్రాండ్ తమ పాల ధరలను సవరిస్తున్నాయని ఆ సంస్థ పేర్కొంది.