న్యూఢిల్లీ : జిఎంఎం ఫడ్లర్‌లో 13.56 శాతం వాటాలను ఫడ్లర్ విక్రయించింది. ఇందుకు సమానమైన 60,94,817 ఈక్విటీ షేర్లను బ్లాక్ డీల్‌లో అమ్మేసినట్లు ఆ సంస్థ శుక్రవారం స్టాక్ ఎక్సేంజీ ఫైలింగ్‌లో వెల్లడించింది. దీంతో ఫడ్లర్‌కు కంపెనీలో 1 శాతం వాటా మిగిలి ఉన్నట్లు జిఎంఎం ఫడ్లర్ పేర్కొంది. ఫడ్లర్ ఐఎన్‌సిను ఈక్విటీ ఫండ్ డిబాగ్ ఫండ్ 6 నిర్వహిస్తుంది.