బంగారం రూ.440 ప్రియం

న్యూఢిల్లీ : బంగారం ధరల్లో పెరుగుదల నమోదయ్యింది. గోల్డ్‌ రిటర్న్‌ వెబ్‌సైట్‌ ప్రకారం.. శనివారం న్యూఢిల్లీ, హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లలో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.440 పెరిగి రూ.59,510గా నమోదయ్యింది. 22 క్యారెట్ల ధర రూ.400 పెరిగి రూ.54,550గా పలికింది. కిలో వెండిపై రూ.1,000 పెరిగి రూ.73,300గా ఉంది. ఇటీవల తగ్గుతూ వచ్చిన బంగారం ధర వారాంతంలో పెరగడం గమనార్హం. అంతర్జాతీయంగా అమెరికాలో ఒక్క ఔన్స్‌ పసిడిపై 0.71 శాతం పెరిగి 1,924 డాలర్లుగా నమోదయ్యింది.

Spread the love