మెక్‌డొనాల్డ్స్‌కు టమాటా సెగ

న్యూఢిల్లీ :దేశంలో భగ్గుమంటున్న టమాటా ధరలతో కార్పొరేట్‌ ఫుడ్‌ చెయిన్‌ సంస్థలు బెంబేలెత్తుతున్నాయి. ఈ సెగ మెక్‌డొనాల్డ్స్‌కు తాకింది. మెను నుంచి టమాటాలు తొలగించింది. హెచ్చు ధరలను తాలలేక, గిట్టుబాటు కాకపోవడంతో బర్గర్లు, ఫిజ్జాల్లో టమాటా వాడకాన్ని నిలిపివేయాలని మెక్‌డొనాల్డ్స్‌ నిర్ణయించింది. తమ నాణ్యతా ప్రమాణాలకు తగిన సరఫరా లేకపోవడంతో టమాటాలను ఉపయోగించడం లేదని ఆ సంస్థ నోటిసు బోర్డులో పెట్టడం విశేషం. అందుకే కొంతకాలం టమాటా లేని ఆహార ఉత్పత్తులను అందించాల్సి వస్తోందని పేర్కొంది. వాస్తవానికి అధిక ధరల వల్ల బర్గర్లు, ఫిజ్జాల్లో టమాటాలు వాడటం లేదని స్పష్టమవుతోంది.

Spread the love