హోటళ్ల ఆదాయంలో 20% వృద్థి : ఓయో

న్యూఢిల్లీ : ప్రముఖ హాస్పిటాలిటీ అగ్రిగేటర్‌ ఓయో ప్రారంభించిన యాక్సిలరేటర్‌ ప్రోగ్రామ్‌లో చేరిన హోటల్‌ యాజమానుల ఆదాయంలో 20 శాతం వృద్థి చోటు చేసుకుందని ఆ సంస్థ తెలిపింది. హోటళ్లను విస్తరించే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా 100 కంటే ఎక్కువ మొదటి తరం హోటళ్లకు మద్దతుగా ఈ ఏడాది డిసెంబర్‌ ముగింపు నాటికి 1000 హౌటళ్లను జోదించనున్నన్నట్లు తెలిపింది. ఇందులో ఇప్పటికే ఓయో 30 హోటల్‌ యజమానులు కొత్తగా 250 హోటళ్లకు మద్దతును అందించారని పేర్కొంది. ఢిల్లీలో ఈ ప్రోగ్రామ్‌లో ఎక్కువ మంది హోటల్‌ యజమానులు భాగస్వామ్యం కాగా.. తర్వాత హైదరాబాద్‌, బెంగళూరు నిలిచాయని తెలిపింది.

Spread the love