పిన్‌కోడ్‌ యాప్‌తో కిరాణా సరుకుల ఆర్డర్‌

హైదరాబాద్‌ : ఒఎన్‌డిసి అభివృద్థి చేసిన లోకల్‌ షాపింగ్‌ యాప్‌ పిన్‌కోడ్‌లో స్థానిక దుకాణాలు, రెస్టారెంట్లన్నిటి నుండి కిరాణా సరకులు, ఆహార పదార్థాలను ఆర్డర్‌ చేయవచ్చని తెలిపింది. తమ ఈ సేవలు హైదరాబాద్‌ మహానగరంలోనూ అందుబాటులోకి వచ్చాయని ఆ సంస్థ వెల్లడించింది. ప్యారడైజ్‌ బిర్యానీ, బెహ్రుజ్‌ బిర్యానీ, రాయలసీమ రుచులు, పిజ్జా హట్‌ లాంటి విఖ్యాత స్థానిక బ్రాండ్లు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. రిఫండ్లు, ఆకర్షణీయ డిస్కౌంట్లు, నిరంతరాయ షాపింగ్‌ అనుభవాన్ని అందిస్తుందని తెలిపింది.

Spread the love