ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌లో ఐడీఎఫ్‌సీ విలీనం

న్యూఢిల్లీ : ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌లో ఐడీఎఫ్‌సీ లిమిటెడ్‌ విలీనం అయ్యింది. ఇందుకు రెండు సంస్థల బోర్డులు ఆమోదం తెలిపాయి. విలీన ప్రతిపాదన ప్రకారం ఐడీఎఫ్‌సీ వాటాదారులకు తమ వద్ద గల ప్రతీ 100 షేర్లకుగాను 155 ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకు షేర్లు పొందనున్నారు. మౌలిక వసతుల రంగానికి మద్దతును అందించడానికి 1997లో ఐడీఎఫ్‌సీని ఏర్పాటు చేయగా.. ఆ సంస్థ తన అనుబంధంగా 2014 ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ను ఏర్పాటు చేసింది. కాగా.. మాతృసంస్థనే తాను నెలకొల్పిన సబ్సీడరీలో విలీనం కావడం విశేషం. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌కు 2023 మార్చి నాటికి 809 శాఖలు, 925 ఏటీఎంలు ఉన్నాయి.

Spread the love