వ్యాట్సాప్‌, ఫేస్‌బుక్‌లపై నియంత్రణ..!

– ట్రారు సంప్రదింపులు
న్యూఢిల్లీ : సోషల్‌ మీడియా యాప్స్‌ను కేంద్రం తన గుప్పిట్లోకి తీసుకునే ప్రక్రియను ప్రారంభించి నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, టెలి గ్రామ్‌, సిగల్‌ తదితర సోషల్‌ మీడియా యాప్‌ ప్రొవైడర్లను నియంత్రిం చడంపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రారు) సంప్రదిం పులు ప్రారంభించింది. ఆందోళనలు, ఉద్రిక్త పరిస్థితుల్లో ఆ యాప్స్‌పై కొంత సమయం లేదా తాత్కాలిక నిషేధం విధించాల్సిన అవసరం ఉందా.. లేదా అనే విషయం మీద చర్చ మొదలు పెట్టింది. కమ్యునికేషన్‌ యాప్స్‌ నియంత్రణ, తాత్కాలిక నిషేదం వంటి 14 అంశాలపై ట్రారు సంప్రదిం పులను మొదలుపెట్టింది. ఇంటర్నెట్‌ కాలింగ్‌ విషయంలో టెలికాం ప్రొవైడర్లకు వర్తించే నియమాలే కమ్యూనికేషన్‌ యాప్స్‌నకూ వర్తింప జేయాలని టెల్కోలు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నాయి. తమ లాగే లైసెన్స్‌ ఫీజు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి.

Spread the love