– ప్రథమార్థంలో 3% పెరిగిన వాణిజ్య లీజింగ్ స్థలాలు
– నైట్ ఫ్రాంక్ ఇండియా రిపోర్ట్
హైదరాబాద్: దేశ వ్యాప్తం గా నివాస గృహాల అమ్మకాలు తగ్గాయి. ప్రస్తుత ఏడాది జనవరి నుంచి జూన్‌తో ముగిసిన ప్రథమార్థం (హెచ్1) కాలంలో 1 శాతం తగ్గి 1,56,640 యూనిట్ల కు పరిమితమయ్యాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా తన రిపోర్ట్‌లో వెల్లడించింది. గతేడాది ఇదే సమయంలో 1,58,705 యూనిట్లు రిజిస్ట్రర్ అయ్యారు. ఇదే సమయంలో 25.3 మిలియన్ల చదరపు అడుగుల కార్యాల యాల స్థల లీజింగ్ రికార్డ్ కాగా.. గడిచిన హెచ్1లో 3 శాతం పెరిగి 26.1 మిలియన్ చదరపు అడుగులుగా నమోదయ్యింది. నివాస అమ్మకాల్లో తగ్గుదల చోటు చేసుకున్నప్పటికీ.. గడిచిన తొమ్మిదిన్నరేళ్లలో రెండో సారి గరిష్ట స్థాయి అమ్మకాలు జరిగాయి.
హైదరాబాద్‌లో తగ్గిన ఆఫీసు లీజింగ్
నైట్ ఫ్రాంక్ గణంకాల ప్రకారం.. గడిచిన హెచ్1లో హైదరాబాద్‌లో నివాస అమ్మకాలు 5 శాతం పెరిగి 15,355 యూనిట్లుగా నమోదయ్యా యి. గతేడాది ఇదే హెచ్1లో 14,693 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఇదే సయమంలో ఆఫీసు లీజింగ్ 3.2 మిలియన్ చదరపు అడుగులుగా ఉండగా.. గడిచిన హెచ్1లో 8 శాతం తగ్గి 2.9 మిలియన్ చదరపు అడుగులుగా చోటు చేసుకుంది. 2023 జనవరి నుంచి జూన్ కాలంలో ఢిల్లీ – ఎన్‌సిఆర్ పరిధిలో నివాస అమ్మకాలు 3 శాతం పెరిగి 30,114 యూనిట్లుగా. ఆఫీసు లీజింగ్‌లో 24 శాతం పెరిగి 5.1 మిలియన్ చదరపు అడుగులుగా నమోదయ్యింది. బెంగళూరులో నివాస అమ్మకాలు 2 శాతం తగ్గి 26,247 యూనిట్లుగా, పూణెలో 1 శాతం తగ్గి 21,670 యూనిట్లుగా, చెన్నరులో 3 శాతం పెరిగి 7,150 యూనిట్లుగా, కోల్‌కత్తాలో 3 శాతం పెరిగి 7,324 యూనిట్ల చొప్పున చోటు చేసుకున్నాయి.