దళిత బంధులో అవకతవకలు

– వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షులు వైఎస్‌ షర్మిల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో దళిత బంధు పథకం సక్రమంగా అమలు జరగటం లేదని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షులు వైఎస్‌ షర్మిల విమర్శించారు. శుక్రవారంహైదరా బాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె విలేకర్ల సమావేశాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ దళితబంధు స్కీమ్‌లో అవకతవ కలు జరుగుతున్నాయని ఆరోపిం చారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌ సైతం ఒప్పుకున్నారని తెలిపారు. ఈ పథకంలో జరిగిన అవకతవకలపై ఇంటలిజెన్స్‌ రిపోర్ట్‌ సీఎం వద్ద ఉందని తెలిపారు. దీనిపై స్వయంగా ఆయన ఎమ్మెల్యేలను కూర్చొబెట్టు కుని మాట్లాడారంటే.. అందులో అవినీతి జరుగుతోందని అంగీకరించే నట్టే కదా? అని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు.
హౌస్‌ అరెస్టు..కార్యాలయంలోనే దీక్ష..
గజ్వేల్‌లోని ప్రజాసమస్యలు పరిశీలించేందుకు శుక్రవారం షర్మిల అక్కడికి బయల్దేరారు. అయితే గజ్వేలు పర్యటనకు పోకుండా ఆమెను పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు.దీంతో కార్యాలయంలోనే సాయంత్రం వరకు ఆమె నిరసన దీక్ష కొనసాగించారు.

 

 

Spread the love