4.97కోట్ల ఇంటి పన్ను వసూలు: మున్సిపల్ కమిషనర్ బోళ్ల శ్రీనివాస్

నవతెలంగాణ – సూర్యాపేట
2024-2025 ఆర్ధిక సంవత్సరానికి చెందిన ఇంటిపన్ను ను ఏప్రిల్ 30 లోపు చెల్లించిన వారికీ పన్ను ఫై 5% రిబేట్ ఇవ్వడం ద్వారా  రూ. 4 కోట్ల 97 లక్షలు ఇంటిపన్ను లు వసూలు చేయడం జరిగిందని మున్సిపల్ కమీషనర్ బి.శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటన లో తెలిపారు.పట్టణంలో ఏప్రిల్ నెల 1 నుండీ 30 వరకు 8079 గృహాల నుండి పన్ను వసూలు చేయడం జరిగిందని పేర్కొన్నారు.  గత 2023-2024 ఆర్ధిక సంవత్సరం 5% రిబేట్ పై గృహ యజమానుల నుండి 4 కోట్ల 42 లక్షలు వసూలు చేశారని కాగా ఈసారి అదనంగా రూ 55.00 లక్షలు వసూలు చేయడం జరిగిందని తెలిపారు.గృహ యజమానులలో ఆవైర్ నెస్ రావడం వల్ల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పన్నులు చెల్లించారని వివరించారు. వారిలో మార్పు రావడం అభినందనియం అన్నారు.పన్నుల వసూలు కు కృషి చేసిన బిల్ కలెక్టర్లను రెవిన్యూ సిబ్బందిని ఆయన అభినందించారు. ఇంకా ఇంటిపన్ను బకాయి గల వారు వెంటనే పన్ను చెల్లించాలని లేనిచో నూటికి రూ 2/- ల చొప్పున అపరాధ రుసుము చెల్లించవలసి ఉంటుందని తెలిపారు.
Spread the love