వాడవాడలో ఘనంగా మేడే వేడుకలు

నవతెలంగాణ – కోహెడ
మండల కేంద్రంతోపాటు మండలంలోని తీగలకుంటపల్లి, కూరెళ్ళ, వింజపల్లి, చెంచల్‌చెర్వుపల్లి, పరివేద, కాచాపూర్‌, సముద్రాల, శ్రీరాములపల్లి, నారాయణపూర్‌, గొట్లమిట్ట, వెంకటేశ్వరపల్లి, మైసంపల్లి గ్రామాలతో పాటు పలు గ్రామాలలో బుధవారం మేడే ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జెండాను ఎగురవేసి ఘణంగా వేడుకలు నిర్వహించారు. ఆదర్శ హామాలి సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, తాపీ కార్మిక సంఘం, ఎలక్ట్రికల్‌ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆయా సంఘం అధ్యక్షుల చేతులమీదుగా జెండాను ఎగురవేసి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం, శ్రమకు తగిన వేతనం ఇవ్వాలని కోరుతూ చికాగోలో జరిగిన మారణహోమంలో ఎందరో కార్మికుల అసువులు బాసారని వారి జ్ఞాపకార్థం జరుపుకోనె పండుగనే ఈ మేడే అని వారన్నారు. ఈ కార్యక్రమాలలో మండల వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు బండారి రమేష్‌, నాయకులు ర్యాగటి బాబు, వేల్పుల జాన్‌, కొంకటి దామోదర్‌, బత్తుల రాంచంద్రం, ఆరె జగదీష్‌, బండ స్వామి, నిమ్మనగొట్టు వీరన్న, బండారి శ్రీనివాస్‌, కమలాకర్‌రావు, మ్యాకల సంపత్‌, రాజు, తిరుపతి, ప్రభాకర్‌, ఎల్లయ్య, బిక్షపతి, ప్రసాద్‌, గుర్రం రాజిరెడ్డి, మధు, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.
Spread the love