
మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద శుక్రవారం అంబేద్కర్ సంఘం, మహానీయుల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మాజీ ఉపప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ 117వ జయంతి వేడుకలను పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ ఛైర్మన్ రాగుల శ్రీనివాస్ మాట్లాడుతూ దళితుల, గిరిజనుల, నిమ్నవర్గాల ప్రజలు సమానంగా అన్ని రంగాలలో పోటీ పడాలంటే రిజర్వేషన్లు ఉండాల్సిందేనని పోరాడిన గొప్ప వ్యక్తిని కొనియాడారు. ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక నిధులు ఉండాలని, అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలు రూపకల్పన చేసిన నాయకుడు జగ్జీవన్‌రావు అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది జేరిపోతుల కిరణ్‌కుమార్, అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు వేల్పుల జాన్, నాయకులు బందెల బాలకిషన్, వేల్పుల శంకర్, వేల్పుల వెంకటస్వామి, బందెల రాజమౌళి, గూడ స్వామి, తలారి నర్సయ్య, తలారి బాబు, తలారి మహెష్, జాగిరి కుమారస్వామి, గాజుల రవీందర్, వేల్పుల లక్ష్మినారాయణ, ఎత్తి నగేష్, సుధాకర్, తలారి శంకర్‌బాబు, మంద కిష్టయ్య, మోహన్, భీంరెడ్డి తిరుపతిరెడ్డి, జేరిపోతుల రమేష్, చెప్యాల సంపత్, మెతుకు భగవాన్‌రెడ్డి, జగ్గారెడ్డి, పిడిశెట్టి రాజయ్య, పిడిశెట్టి సంపత్, గౌరవేణి రాజయ్య, విలాసాగర్ అంజయ్య, చామంతుల రాజయ్య, దానవేణి కనుకయ్య, గుండెల్లి చంద్రం, తదితరులు పాల్గొన్నారు.