
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండిపోయిన పంటలను పరిశీలించెందుకు వెళ్తున్న మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కెసీిఆర్‌కు కోహెడ మండలంలోని శనిగరం స్టేజి వద్ద మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్ ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు పెరుగు నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి ఘన స్వాగతం పలికారు. తమ అభిమాన నేతను తిలకించేందుకు ఎండను సైతం లెక్కచేయకుండా కార్యకర్తలు రోడ్డుకు ఇరువైపులా నిల్చుని పార్టీ జెండాలను ఊపుతూ జై తెలంగాణ నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. ఆయన వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఆయనతో పాటు కాన్వాయిల్లో సిద్దిపేటకు చెందిన బీఆర్‌ఎస్ నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కర్ర శ్రీహరి, మాజీ మండల అధ్యక్షుడు ఆవుల మహేందర్, నాయకులు పొన్నాల లక్ష్మయ్య, తిప్పారపు శ్రీకాంత్, కొక్కుల సురేష్, తిప్పారపు నాగరాజు, యాద అశోక్, జాలిగాం శంకర్, పొన్నాల శంకర్, మెతుకు లింగారెడ్డి, దయ్యాల రాజు, తాడిచెట్టు దయానంద్, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.