హన్మకొండ జిల్లాలో… 5.08లక్షల మంది ఓటర్లు

హన్మకొండ జిల్లాలో... 5.08లక్షల మంది ఓటర్లు– 119 సమస్యాత్మక పోలింగ్‌ స్టేషన్లు ‘మిషన్‌ 29’లో ‘పశ్చిమ’
– 10 శాతం పోలింగ్‌ పెంపు లక్ష్యం.. వరంగల్‌ పశ్చిమలో 15
– పరకాలలో 28 మంది అభ్యర్థులు 2,324 మంది సిబ్బంది
– విఐఎస్‌, విఎబిల ఏర్పాట్లు కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
హన్మకొండ జిల్లాలో తాజా లెక్కల ప్రకారం 5 లక్షల 8 వేల 218 మంది ఓటర్లున్నారని, ఈనెల 30వ తేదీన జరుగనున్న ఎన్నికల్లో ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని హన్మకొండ జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి సిక్తా పట్నాయక్‌ ఓటర్లను కోరారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ ఓటర్లు తమ ఓటును ఓటరు జాబితాలో తనిఖీ చేసుకోవాలని కోరారు. జిల్లాలో వరంగల్‌ పశ్చిమ, పరకాల నియోజకవర్గాలున్నాయని, నామినేషన్ల ఉపసంహరణ అనంతరం వరంగల్‌ పశ్చిమలో 15 మంది, పరకాల నియోజకవర్గంలో 28 మంది అభ్యర్థులున్నారన్నారు. ఇందుకనుగుణంగా ‘పశ్చిమ’లో 1 ఇయు, పరకాలలో 2 ఇయులను వినియోగించనున్నట్లు చెప్పారు. పరకాల నియోజకవర్గంలో 2 లక్షల 21 వేల 439 మంది ఓటర్లుండగా, ఇందులో పురుషులు 1 లక్షా 8 వేల 280 మంది, మహిళలు 1 లక్షా 13 వేల 154మంది ఉన్నారన్నారు. వరంగల్‌ పశ్చిమ నియోజకవ ర్గంలో 2లక్షల86వేల 779 మంది ఓటర్లుండగా, ఇందులో పురుషులు 1 లక్షా 41 వేల 666 మంది, మహిళలు 1 లక్షా 45వేల9మంది ఓటర్లున్నారన్నారు. జిల్లాలో 48వేల 122 ఓటరు గుర్తింపు కార్డులకుగాను 43వేల700 ఓటర్లు గుర్తిం పు కార్డులను పంపిణీ చేశామన్నారు. మరో 4,104 కార్డులు మరో వారం రోజుల్లోపు పంపిణీ చేస్తామన్నారు. జిల్లాలో 484 పోలింగ్‌ కేంద్రాలకు 50శాతం పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ క్యాస్టింగ్‌ నిర్వహిస్తున్నారు. పోలిస్‌ అధికారుల సూచనల మేరకు సమస్యాత్మక కేంద్రాల్లో పోలింగ్‌ కేంద్రాలకు వెలుపల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 29 నియోజకవర్గాల్లో అతితక్కువ పోలింగ్‌ శాత ముండడం, ఇందులో వరంగల్‌ పశ్చిమ నియో జకవర్గం కూడా ఉందన్నారు. దీంతో ఎన్నికల సంఘం ‘మిషన్‌ 29’ పేరిట ప్రత్యేక కార్యచరణ ప్రకటించిందన్నారు. ‘పశ్చిమ’లో గత ఎన్నికల్లో 59 శాతం మాత్రమే పోలింగ్‌ నమోదైం దన్నారు. ఈ ఎన్నికల్లో అదనంగా 10 శాతం పోలింగ్‌ను పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నాట్లు చెప్పారు. దివ్యాంగులు, 80 ఏళ్లు దాటిన వయోవృద్ధులు 12 డి ఫారమ్‌ ద్వారా హౌం ఓటింగ్‌ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. 671 మందికి ఈ విధమైన సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. 12 ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలట్‌ సౌకర్యం కల్పించనున్నామన్నారు. 3,553 మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం వినియోగించుకోనున్నారన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ తీసుకొని సంబంధిత పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించుకోని పక్షంలో మళ్లీ ఓటు హక్కును నవంబర్‌ 30న వినియోగించుకోవడానికి అవకా శముండదన్నారు. ఈ విషయం పోస్టల్‌ బ్యాలెట్‌ తీసుకున్న ఓటర్లు గుర్తుంచుకోవాలన్నారు. జిల్లాలోని రెండు నియోజ కవర్గాల్లో 3,553 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ తీసుకున్నార న్నారు. వారందరూ ఈనెల 20వ తేదీన రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలోగాని, వారికి పోలింగ్‌పై శిక్షణనిచ్చే క్రమంలో ఏర్పాటు చేసిన కేంద్రంలోగాని ఓటు హక్కును వినియోగిం చుకోవాలన్నారు. పోలీస్‌ సిబ్బందికి సైతం ప్రత్యేకమైన పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఓటర్‌ ఇన్‌ ఫర్మేషన్‌ స్లిప్‌ (విఐఎస్‌), ఓటర్‌ అసిస్టెన్స్‌ బూత్‌ (విఎబి)లను ఓటర్లు వినియోగించుకోవాలన్నారు. విఐఎస్‌లను ఈనెల 25వ తేదీలోపు ఇంటింటికీ పంపిణీ చేయడం పూర్తి చేస్తా మన్నారు. ప్రతి పోలింగ్‌ బూత్‌ వద్ద ఓటర్‌ అసిస్టెన్స్‌ బూత్‌ (విఎబి)ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. విఐఎస్‌ ఎవరికైనా అందకపోతే విఎబిల్లో తమ ఓటు ఏ బూత్‌లో వుందో చూసుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. హన్మకొండ జిల్లాలోని వరంగల్‌ పశ్చిమ, పరకాల నియోజక వర్గాల్లో ఎన్నికలకు సంబంధించి 2,324 మంది పోలింగ్‌ సిబ్బందిని నియమించినట్లు కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ తెలిపారు. వరంగల్‌ పశ్చిమలో 239 పోలింగ్‌ కేంద్రాలకు గాను 287 మంది చొప్పున పోలింగ్‌ అధికారులు, సహాయక పోలింగ్‌ అధికారులను నియమించడంతోపాటు 574 మంది ఒపిఓలను నియమించినట్లు చెప్పారు. ‘పశ్చిమ’ నియోజకవ ర్గంలో మొత్తం 1,148 మంది పోలింగ్‌ సిబ్బందిని నియమించి నట్లు వివరించారు. పరకాల నియోజకవర్గంలో 245 పోలింగ్‌ కేంద్రాలుండగా, 294 మంది చొప్పున పోలింగ్‌ అధికారులు, సహాయక పోలింగ్‌ అధికారుల తోపాటు 588 మంది ఒపిఓలను నియమించామన్నారు. మొత్తంగా పరకాల నియోజకవర్గంలో 1,176 మంది సిబ్బందిని నియమించామన్నారు. హన్మకొండ జిల్లాలోని పరకాల నియోజకవర్గంలో 58, వరంగల్‌ పశ్చిమ నియోజ కవర్గంలో 61 పోలింగ్‌ కేంద్రాలు సమస్యాత్మక పోలింగ్‌ కేం ద్రాలుగా గుర్తించినట్లు చెప్పారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వెలుపల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామ న్నారు.
భారీ బందోబస్తు ఏర్పాటు : సెంట్రల్‌ డీసీపీ అబ్దుల్‌ బారి
హన్మకొండ జిల్లాలోని వరంగల్‌ పశ్చిమ, పరకాల ని యోజకవర్గాల్లో ఎన్నికలను శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి భారీ బందోబస్తును ఏర్పాటు చేయ నున్నట్లు వరంగల్‌ సెంట్రల్‌ డిసిపి అబ్దుల్‌ బారి తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో 18 సెక్షన్‌ల పారా మిలటరీ దళాలను వినియోగించుకోవడానికి ఏర్పాట్లు పూర్తి చేశామ న్నారు. 425 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని నియ మించనున్నామన్నారు. పరకాల నియోజకవర్గంలో బిఎస్‌ఎఫ్‌ దళాలతోపాటు పోలీసు సిబ్బందిని నియమించి శాంతియు తంగా ఎన్నికలు నిర్వహించడానికి సన్నద్ధం చేసినట్లు చె ప్పారు. సమావేశంలో అడిషనల్‌ కలెక్టర్‌ మహేందర్‌జీ, ట్రైనీ కలెక్టర్‌ శ్రద్ధా శుక్లా తదితరులు పాల్గొన్నారు.

Spread the love