బడ్జెట్లో వికలాంగులకు 5% శాతం కేటాయించాలి

– వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షులు: సురుపంగ  ప్రకాష్
నవతెలంగాణ – వలిగొండ రూరల్ 
మండల పరిధిలోని లోతుకుంట గ్రామంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో పార్వతి అధ్యక్షతన శుక్రవారం  గ్రామ సభను నిర్వహించినారు. ఈ సభను ఉద్దేశించి వికలాంగుల హక్కుల జాతీయ వేదిక యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు సురపంగా ప్రకాష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో వికలాంగులకు ఐదు శాతం కేటాయించాలని  ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న వికలాంగుల జనాభా కు అనుకూలంగా బడ్జెట్ కేటాయించనందువల్ల వికలాంగులకు అందాల్సిన ప్రతిఫలాలు అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేటాయించిన బడ్జెట్లో వికలాంగుల పరికరాలు అరకొరగా అందించడానికి కూడా సరిపోవడంలేదని వికలాంగులకు ఇచ్చిన హామీలు వల్ల అందాల్సిన ప్రతిఫలాలు అమలు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో వికలాంగులకు ఐదు శాతం కేటాయిస్తేనే సాధ్యమవుతుందని అన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన వికలాంగులకు రూ.6000 పెన్షన్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, తదితర హామీలన్నీ వెంటనే నెరవేర్చాలని వారు కోరారు.వఈ కార్యక్రమంలో లోతుకుంట గ్రామ కమిటీ ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షులుగా పాక పెంటయ్య, అధ్యక్షులుగా చిలకమారి వీరాచారి ఉపాధ్యక్షులుగా వల్లపు లింగయ్య, ప్రధాన కార్యదర్శిగా శీల శ్రావణి, సహాయ కార్యదర్శులుగా పాక రాజమణి  ఎన్నికైనట్లు తెలియజేయడం జరిగింది.
Spread the love