సంక్షేమ శాఖల్లో 581 పోస్టులు

సంక్షేమ శాఖల్లో 581 పోస్టులు– పరీక్షల షెడ్యూల్‌ విడుదల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సంక్షేమ శాఖల్లో 581 పోస్టుల భర్తీకి ప్రభుత్వం పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ మేరకు టీజీపీఎస్‌సీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సార్వత్రిక ఎన్నికలు పూర్తి కావటంతోనే టీజీపీఎస్‌సీ ఈ ప్రక్రియకు సిద్ధమైంది. ఇటీవల గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించి ప్రాథమిక కీని విడుదల చేసిన అధికారులు.. తాజాగా రాష్ట్రంలోని గురుకులాల్లో పలు పోస్టుల భర్తీకి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా శిశు సంక్షేమ శాఖల పరిధిలోని వసతి గృహాల్లో 581 మంది అధికారులు, పిల్లల సంరక్షణ గృహాల్లో 19 మహిళా సూపరింటెండెంట్‌ పోస్టులకు 2022 డిసెంబర్‌లో నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన పరీక్షలను జూన్‌24 నుంచి 29వరకు నిర్వహించాలని టీజీపీఎస్‌సీ నిర్ణయించింది. ప్రతి రోజు రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. కంప్యూటర్‌ ఆధారిత(సీఆర్‌బీటీ) విధానంలో నిర్వహించే ఈ పరీక్షలు ప్రాంరభం కావటానికి మూడు రోజుల ముందు నుంచి తమ అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వెల్లడించారు.

Spread the love