ఇజ్రాయెల్‌కు వెళ్లనున్న 6 వేల మంది భారత శ్రామికులు..

నవతెలంగాణ – హైదరాబాద్: ఇజ్రాయెల్‌ – హమాస్‌ యుద్ధం ఆరునెలలుగా కొనసాగుతోంది. ఈ యుద్ధంలో ఇరువైపులా భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. యుద్ధం కారణంగా గాజా స్ట్రిప్‌ అతలాకుతలమవుతోంది. అనేక మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఉండేందుకు ఇల్లు, తినేందుకు ఆహారం, తాగేందుకు నీరు లేక అల్లాడిపోతున్నారు. ఇక హమాస్‌తో ఘర్షణల వల్ల ఇజ్రాయెల్‌ నిర్మాణ రంగం కుదేలైంది. ప్రస్తుతం ఈ రంగంలో కార్మికుల కొరత తీవ్రమైంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇజ్రాయెల్‌లో అనేక ప్రాజెక్టులు నిలిచిపోయాయి.

Spread the love