మల్హర్ లో 6,429 మంది ఓటెయ్యలే..?

నవతెలంగాణ-మల్హర్ రావు
పార్లమెంట్ ఎన్నికల్లో మండలంలో ఈసారి 6,429 మంది ఓటు వేయలేదు.మండలంలో మొత్తం 15 గ్రామపంచాయతీల్లో ఓటర్లు 21,935 ఉండగా 15,466 మంది మాత్రమే ఓటు వేసి మిగతా 6,429 మంది ఓటుకు దూరంగా ఉన్నారు.వీరిలో అత్యధికంగా పట్టణాల్లో ఉంటూ ఓటుహక్కు పల్లెల్లో ఉన్నవారే కావడం విశేషం.అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 13 శాతం ఓటింగ్ తగ్గింది.వృద్ధులు,వికలాంగులు సైతం ఓటింగ్ లో పాల్గొన్నారు.కానీ మధ్య వయస్సు ఉన్నవారు మాత్రం ఓటుహక్కు వినియోగించుకోవడానికి ముందుకు రాకపోవడం గమనార్హం.ప్రజాస్వామ్యంలో ఓటు ఒక వజ్రాయుధం, ఓటు కీలకమని,అర్హులైనవారు ప్రతి ఒక్కరూ వేయాలని ప్రధాన రాజకీయ పార్టీలు విస్తృతంగా ప్రచారం చేయడం మరోవైపు రాష్ట్ర ,ప్రభుత్వం, ప్రభుత్వ  అధికారులు,కళాకారులతో పాటల, ఆటల రూపంలో ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినప్పటికి ఓటింగ్ శాతం మాత్రం పెరగలేదు.దీనికి తోడుగా మేజర్ గ్రామపంచాయతియిన తాడిచెర్ల ముందస్తుగా ఓటింగ్ స్లిప్స్ పంచకపోవడం,ఎన్నికలరోజే బిఎల్ఓలు స్లిప్స్ ఇచ్చినట్లుగా హడావిడి చేయడంతో కొంతవరకు ఓటింగ్ తగ్గినట్లుగా బావించక తప్పదు.గుర్తింపు కార్డులు పట్టుకొని వచ్చిన కొందరు ఓటర్ల పేర్లు ఓటింగ్ లిస్టులో గల్లంతైన నేపథ్యంలో వారు ఓటు వేయకుండా ఇంటిబాట పట్టడంతో ఓటింగ్ శాతం తాడిచెర్లలో పడిపోయి మండలంలో తగ్గింది.
Spread the love