ఆల్చిప్పల కోసం వెళ్లి నదిలో మునిగి..
ఉత్తర కన్నడ జిల్లాలో ఘోరం
ఒక్కసారిగా నీటి మట్టం పెరగడమే కారణం
సిరాలి : కర్నా టకలోని ఉత్తర కన్నడ జిల్లా భట్కల సమీపంలోని తత్తెహక్కలు నదిలో నత్తగుల్లల సేకరణ కోసం దిగిన ఒకే కుటుంబానికి చెందిన 11 మంది గల్లంత య్యారు. సమాచారం అందుకున్న పోలీ సులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో 8 మంది మృతదేహాలను వెలికితీశారు. మృతులంద రినీ భట్కల తాలూకా సిరాలి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మిగిలిన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విషాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం (ఎక్స్‌గ్రేషియా) ప్రకటించారు. “ఉత్తర కన్నడ జిల్లాలోని నదీతీర ప్రాంత ప్రజలు సీజనల్‌గా ఇలా నత్త గుల్లలు సేకరిస్తుంటారు. అదే విధంగా శిరాలీ గ్రామానికి చెందిన సుమారు 14 మంది నత్తగుల్లల (కప్పగుల్లలు) సేకరణ కోసం నదిలోకి దిగారు. అయితే వారు నీటి మట్టాన్ని సరిగ్గా అంచనా వేయకుండా లోతైన ప్రాంతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఆ సమయంలో ఒక్కసారిగా నీటి ప్రవా హం పెరగడంతో ఒకరిద్దరు కొట్టుకుపో యారు. దీనితో వారిని రక్షించేందుకు మరికొందరు నదిలోకి దూకారు. కానీ వారు కూడా బలమైన నీటి ప్రవాహంలో చిక్కుకుపోయారు. “ఇప్పటి వరకు 8 మంది మృతదేహాలను వెలికితీశాం. మిగి లిన వారి కోసం గాలింపు చర్యలు జరుగు తున్నాయి” అని పోలీసులు తెలిపారు.
మృతుల వివరాలు
మృతులను ఉమేశ్ మంజునాథ్ నాయక్ (40), లక్ష్మి మహాదేవ్ నాయక్ (42), లక్ష్మి జట్టప్ప నాయక్ (30), లక్ష్మి అప్పన్న నాయక్ (60), లక్ష్మి శివరామ్ నాయక్ (49), జ్యోతి మస్తమ్మ నాయక్ (34), మాలతి నాయక్ (38), మస్తమ్మ నాయక్ (60)గా గుర్తించారు. ఇక నీటి ప్రవాహంలో చిక్కుకున్న నాగరత్న, మహాదేవిలను రక్షించి, వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. రెస్క్యూ సిబ్బంది, పోలీసు బృందాలు, స్థానికులు నదిలో ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన 8 మంది చనిపోవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి.
ప్రమాదానికి కారణం?
ఈ ప్రాంతంలో కురిసిన వర్షాల కారణంగా నదిలీ ప్రవాహ ఉధృతి ఒక్కసారిగా పెరిగిందని, గుల్లలను సేకరిస్తూ నదిలోని లోతైన ప్రాంతాల్లోకి వెళ్లిన పలువురు ఈ ప్రవాహంలో చిక్కుకొని కొట్టుకొనిపోయారని పోలీసులు పేర్కొన్నారు. “చేపల వేటలాగే, నత్తగుల్లలు సేకరణ కొందరికి జీవనోపాధి కల్పించే ఒక వృత్తిగా ఉంది. మునిగి పోయిన వారిలో చాలా మందికి ఈ పనిలో మంచి అనుభవం ఉంది. వారిలో చాలా మందికి ఈత కూడా వచ్చు. అందుకే ప్రమాదానికి గల కారణాలపై ఇంకా నిర్ధరించాల్సి ఉంది” అని పోలీసులు తెలిపారు.



