ఎగుమతుల్లో 9 శాతం పెరుగుదల

ఎగుమతుల్లో 9 శాతం పెరుగుదలన్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాది మేలో భారత ఎగుమతులు 9.1 శాతం పెరిగి 38.13 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయని వాణిజ్య శాఖ సెక్రెటరీ సునీల్‌ భత్వల్‌ తెలిపారు. కాగా.. దిగుమతులు 7.7 శాతం పెరిగి 61.91 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఏప్రిల్‌లో ఎగుమతులు 1.07 శాతం పెరిగి 35 బిలియన్లుగా, దిగుమతులు 10.25 శాతం పెరిగి 54.1 బిలియన్‌ డాలర్లు చోటు చేసుకున్నాయి. 2023-24లో భారత ఎగుమతులు 3.1 శాతం తగ్గి 437 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. గడిచిన, ఏప్రిల్‌, మేలో ఎగుమతులు పెరగడం సానుకూలాంశమని ఆ వర్గాలు పేర్కొన్నాయి. 2024 ఏప్రిల్‌-మేలో 5.1 శాతం వృద్థితో 73.12 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు జరిగాయి. మలేషియా, నెథర్లాండ్‌, బ్రిటన్‌, యూఏఈ, అమెరికా దేశాలకు చేసిన ఎగుమతుల్లో పెరుగుదల నమోదయ్యింది.

Spread the love