మల్హర్ లో ఇంటిపన్ను 90శాతం వసూల్

– వందశాతానికి అడుగులు వేస్తున్న కార్యదర్శులు 
– ఇంకా గడువు 20 రోజులే
నవతెలంగాణ – మల్హర్ రావు
పంచాయతీ కార్యదర్శులకు అదనపు పనిభారం ఉన్న వాటిని అధిగమించి వందశాతం ఇంటి పన్ను వసూలు చేయడమే ద్యేయంగా మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల కార్యదర్శులు అడుగులు ముందుకు వేస్తున్నారు.ఇప్పటికే మండల వ్యాప్తంగా 90.60 శాతం ఇంటి పన్ను వసూలు చేసినట్లుగా మండల ఎంపిఓ విక్రమ్ కుమార్ తెలిపారు.ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగియనుంది. ఇందుకు ఇంకా 20 రోజులు మాత్రమే గడువు ఉంది.ఈ కొన్ని రోజుల్లో అన్ని గ్రామాల్లో వందశాతం ఇంటి పన్ను వసూల్ చేసేందుకు కార్యదర్శులు అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది.2023-24 ఆర్థిక సంవత్సరానికి నిర్దారించిన ఆస్తి పన్ను గడువులోపుగా వందకు 100 శాతం వసూలు చేస్తామని ఎంపీఓ పేర్కొన్నారు.మండలంలో మొత్తం 15 గ్రామపంచాయితీల్లో  ఇప్పటికే మల్లంపల్లి, దుబ్బపేట గ్రామాల్లో ఇంటి పన్ను 100 శాతం పూర్తికాగా అత్యధిక తక్కువ తాడిచెర్లలో 83.75 శాతం పూర్తి అయింది.మండల వ్యాప్తంగా మొత్తం రూ.22,85,167 లక్షలు చేయాల్సి ఉండగా ఇప్పటికి రూ.22,76,588 లక్షలు పూర్తియి 90.60 శాతం పూర్తిస్థాయిలో అయింది.
ఇంటి పన్ను వసూలు ఇలా:
1) తాడిచెర్లలో 83.75       శాతం.
(2) మల్లారంలో 87.83     శాతం.
(3) పెద్దతూoడ్లలో 92.97   శాతం.
(4) చిన్నతూoడ్లలో 97.76  శాతం.
(5) దుబ్బపేటలో 100      శాతం.
(6) అడ్వాలపల్లిలో 97.2   శాతం.
(7) కొయ్యుర్ లో 93.30   శాతం.
(8) ఇప్పలపల్లిలో 98.18  శాతం.
(9) కొండంపేటలో 94.46 శాతం.
(10) వళ్లెంకుంటలో 99.13 శాతం.
(11) నాచారంలో 92.94 శాతం.
(12) ఆన్ సాన్ పల్లిలో 90.75శాతం.
(13) మల్లంపల్లిలో 100   శాతం.
(14) రుద్రారంలో 93.67  శాతం.
(15) ఎడ్లపల్లిలో 91.88   శాతం.
Spread the love