- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
ఎవరో వస్తారు, ఏమో చేస్తారని ఎదురు చూడకుండా, మంగళవారం రోడ్డుపై గుంతలను పూడ్చి ఆటో కార్మికులు ఆదర్శంగా నిలిచారు. రామారెడ్డి గంగమ్మ వాగు పై నిర్మించిన బ్రిడ్జి పనులు పూర్తికాక పోవడం, వర్షాలకు రోడ్డుపై గుంతలు ఏర్పడి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడడంతో, రామారెడ్డి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో గుంతలను పూడ్చారు. వీరికి గ్రామస్థులతో పాటు, వాహనదారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నామాల శంకర్ ఆటో యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -