- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛత పక్వాడా స్వచ్ఛత పక్షోత్సవాలలో భాగంగా శుక్రవారం విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. పెర్కిట్ ప్రధాన కూడలి వద్ద స్వచ్ఛతపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు మద్దికుంట శ్రీనివాస్ విద్యార్థులందరిచే ప్రతిజ్ఞ చేయించారు. ర్యాలీలో పరిసరాల పరిశుభ్రత కాపాడాల్సిన బాధ్యత అందరిదని, ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
- Advertisement -