Saturday, July 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్ ప్రక్రియకు ప్రతి ఒక్కరూ సహరించాలి: సర్పంచ్

సర్ ప్రక్రియకు ప్రతి ఒక్కరూ సహరించాలి: సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్ 
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ప్రజలు బీఎల్ఓలకు సహకరించాలని మేనూర్ గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 25 నుంచి మొదలైన ప్రక్రియలో భాగంగా శనివారం అధికారులు మేనూర్ గ్రామంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఇంటిటికీ వెళ్ళి అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరూ అధికారులకు తమ వివరాలను అందజేసీ, తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. ఏవైనా సందేహాలు ఉంటే సెక్రెటరీని గానీ, నన్ను (సర్పంచ్) గానీ సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో కార్యదర్శి హరీష్ కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -