- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
దీపావళి పండుగను పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులందరితో కలిసి, జిల్లా ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని, జీవితాల్లో సరికొత్త వెలుగులు చీకట్లు తొలగి, చిరు దివ్వెల వెలుగుల వలె అనునిత్యం సుఖ సంతోషాలు వెలసిల్లాలని వారు ఆకాంక్షించారు. చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు ఎంతో ఉత్సాహంగా నిర్వహించుకునే దీపావళి పండుగను ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూ, ఇంటిల్లిపాది ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
- Advertisement -