- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఏఈ, జేటీవో ఉద్యోగ అభ్యర్థులకు రేవంత్ సర్కార్ తీపీ కబురు చెప్పింది. పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న నీటిపారుదల శాఖలో 224 అసిస్టెంట్ ఇంజనీర్లు (ఏఈ)లు, 199 మంది జూనియర్ టెక్నికల్ అధికారులు (జేటీవో)ల నియామక పత్రాల అందజేతకు మూహుర్తం ఖరారైంది. రేపు సాయంత్రం జలసౌధలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించనున్నారు. అనంతరం నీటి పారుదల శాఖ అంశాలపై సమీక్ష జరపనున్నారు.
- Advertisement -