- Advertisement -
నవతెలంగాణ -మర్రిగూడ : మండలంలోని అజ్జలాపురం ప్రభుత్వ పాఠశాలలో శనివారం రొక్కం భాస్కర్ రెడ్డి సహకారంతో విక్టరీ యూత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు టై, బెల్ట్, షూస్, ఐడి కార్డు, క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ… ప్రైవేట్ పాఠశాల వద్దు ప్రభుత్వ పాఠశాల ముద్దు అని పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ఉపాధ్యాయుల బృందం చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.విద్యాభివృద్ధిలో తన సహకారం ఎల్లవేళలా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పుల్లయ్య,ముద్దం శ్రీధర్, మేగవత్ చందు నాయక్, వెంకటేష్, కృష్ణ, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



