నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాల విద్యార్థినీలకు మంగళవారం (యూనిఫామ్) ఏకరూప దుస్తులను మండల తాసిల్దార్ ఎండి ముజీబ్, ఐకెపి ఎపిఎం జగదీష్ కుమార్, మండల ప్రజా ప్రతినిధులు కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధరాస్ సాయిలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని అన్నారు. కస్తూర్బా పాఠశాల అభివృద్ధికి ప్రత్యేకంగా అభివృద్ధి పథంలో నడిపిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ఏపిఎం తో పాటు కస్తూరిబా పాఠశాల ప్రిన్సిపాల్ పాఠశాల ఉపాధ్యాయులు, సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్, నాయకులు సంతోష్ మేస్త్రి, రామ్ పటేల్, ఈరన్న, సుదర్శన్ మున్నా, ఐకెపి సిబ్బంది పాఠశాల సిబ్బంది విద్యార్థినీలు పాల్గొన్నారు.
కస్తూర్బా విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



