నవతెలంగాణ-మద్నూర్
మీ విధులు..ఆదర్శం అభివృద్ధికి నిదర్శనం అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. మంగళవారం ఎంపీడీవో రాణి పదవీ విరమణ కార్యక్రమాన్ని మైథిలి ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై, ఎంపీడీఓ దంపతులను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎంపీడీవో రాణి చేసిన కృషికి మద్నూర్ మండలం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. అంతేకాదు ఆదర్శ ఎంపీడీవోగా కూడా అవార్డు పొందారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ మద్నూర్ ,డోంగ్లి ,మండలాల సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, ఎంపీడీవో రానికి ప్రత్యేకంగా సన్మానాలు చేశారు. కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎంపీడీవోలు, మెదక్ జిల్లా నుండి పలువురు ముఖ్యులు, వారి బంధుమిత్రులు హాజరయ్యారు.
మీ విధులు ఆదర్శం.. అభివృద్ధికి నిదర్శనం: ఎమ్మెల్యే తోట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



