– పధకం అమలు కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలి
– ప్రజల్లో ఉంటేనే సమస్యలు తెలుస్తాయి
– పార్టీ నియమావళి ప్రకారం పనిచేయాలి
– సీపీఐ(ఎం) జిల్లా నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఉపాధి కూలీలకు నష్టం చేసే వీబీజీ రాంజీ పధకం అమలు నిలిపివేయాలి అని,దాని అమలుకు వ్యతిరేకంగా చేపట్టే నిరసనలు విజయవంతం చేయాలని సీపీఐ (ఎం) జిల్లా నాయకులు పుల్లయ్య పిలుపునిచ్చారు. ప్రజల్లో నిరంతరం ఉంటేనే వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, పార్టీ మాస్ లైన్ ఆచరణలో పెట్టగలమని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కొక్కెరపాటి పుల్లయ్య అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ నియమావళి ప్రకారం కార్యాచరణ చేపట్టాలని ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
మంగళవారం అశ్వారావుపేటలోని సుందరయ్య భవన్‌లో మండల కమిటీ కార్యదర్శివర్గ సభ్యుడు ముల్లగిరి గంగరాజు అధ్యక్షతన పార్టీ మండల కమిటీ, శాఖ కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పుల్లయ్య మాట్లాడుతూ, పార్టీ సభ్యులకు నిరంతరం రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించడంతో పాటు ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త ప్రజలతో మమేకమై పనిచేయాలని ఆయన పేర్కొన్నారు.
ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యుడు బీ. చిరంజీవి, మండల కార్యదర్శి సోడెం ప్రసాద్, మున్సిపల్ క్రిస్టియన్ మైనారిటీ కో-ఆప్షన్ సభ్యురాలు తగరం నిర్మల, మడిపల్లి వెంకటేశ్వరరావు, మడకం గోవిందు తదితరులు పాల్గొన్నారు.



