55వ డివిజన్‌లో ఎమ్మెల్యే ఆరూరి పూజలు

నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా
భీమారంగ్రామంలోని శ్రీ లంభోదర యూత్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి న వరాత్రిలో ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం కుంకుమ పూజ కార్యక్రమానికి వ రంగల్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు, వర్ధ న్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌ విచ్చేసి ప్ర త్యేక పూజలు చేశారు. గణపతిని దర్శించుకు న్న సందర్భంగా యూత్‌ సభ్యులు వారిని శా లువాతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 55వ డివిజన్‌ కార్పొరేటర్‌ జక్కుల రజిత వెంకటేశ్వర్లు, 55వ డివిజన్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు అటికం రవీందర్‌, 55వ డివిజన్‌ యూత్‌ అధ్యక్షులు గుంజే సాయి కుమార్‌,గ్రామ మహిళా అధ్యక్షురాలు సంగాల సరోజన, దోనికెల నరేష్‌, లంభోదర యూత్‌ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love