గుట్టను మింగుతున్న గుత్తేదారులు

– అసైన్డ్‌ భూముల్లో భారీ
– యంత్రాలతో అక్రమ తవ్వకాలు
– పత్తా లేని అధికార యంత్రాంగం
– ఏజెన్సీ చట్టాలకు రక్షణ కరువు
నవతెలంగాణ-వాజేడు
ఏజెన్సీలో చట్టాలను తుంగలో తొక్కుతూ అధికారుల అండదండలతో అభివృద్ధి పనుల మా టున గుట్టలను మింగేస్తూ కోట్ల రూపాయల విలు వచేసే గ్రావెల్‌ను అక్రమంగా తరలిస్తూ గుత్తేదారులు సొమ్ము చేసుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఏజెన్సీ చట్టాల ప్రకారంగా ప్రభుత్వ, పట్టాదారు భూములలో భారీ యంత్రాలు ఉప యోగించి తవ్వకాలు జరప కూడదనే నిబంధనలు ఉన్నాయి. అయినా ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లా వాజేడు మండలంలో రెవెన్యూ కార్యాలయానికి సమీపంలో అసైన్డ్‌ భూములలో గుత్తేదారులు అక్రమ మార్గంలో గుట్టలను భారీ యంత్రాలతో త్రవ్వుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న పట్టించుకునే నాధుడు లేరు. దీంతో గుత్తేదారుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అక్రమ తవ్వకాలపై ప్రశ్నించే ఆదివాసీ సంఘాల నాయకులు, ఇతర కుల సంఘాల నాయకులు ప్రజా తంత్ర వాదులపై సైతం గుత్తేదారులు బెదిరింపులకు తెగబడుతున్న పరిస్థితి. ఏజెన్సీ చట్టాలకు వ్యతిరేకంగా ఎలా అనుమతులు ఇస్తారంటూ, అసైన్డ్‌ భూములలో అనుమతులు లేకుండా ఎలా తవ్వకాలు చేపడుతారని, త్రవ్వకాల్లో కూలీలను ఉపయోగిం చకుండా భారీ యంత్రాలను ఎలా ఉపయోగిస్తున్నారని ఆదివాసి సంఘాల నాయకులు మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అక్రమ గ్రావెల్‌ తవ్వకాలను నిలుపుదల చేయాలని వాజేడు మండలం ప్రజా ప్రతినిధులు తహసిల్దార్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోని దుస్థితి నెలకొంది. ఏజెన్సీలో ప్రభుత్వ, ప్రయివేటు అభివృద్ధి పనులు ఏవైనా చేపడితే ఏజెన్సీ చట్టాలకు అనుగుణంగా పీసీ గ్రామసభ తీర్మానం ఆమోదంతోటే జరగాలి. కానీ, ఏజెన్సీ మండలాల్లో ఎక్కడ అమలులో లేతని తెలుస్తోంది. దీంతో ఏజెన్సీ లో వలస గిరిజనేతరుల భినామీలు రాజ్యమేలుతున్నారనే ఆరోపణలొస్తు న్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో చట్టాల ఉల్లంఘనకు పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ ప్రజలు కోరుతున్నారు.

Spread the love