‘ఐఆర్డీఏ నిబంధనలకు వ్యతిరేకంగా పోరాడుతాం’

నవతెలంగాణ -హనుమకొండ చౌరస్తా
ఐఆర్‌డిఏ నిబంధనలకు వ్యతిరేకంగా పోరాడుతామని ఎన్‌ఎఫ్‌ఐఎఫ్‌డబ్ల్యూఐ( నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇన్సూరెన్స్‌ ఫీల్డ్‌ వర్కర్స్‌ ఆఫ్‌ ఇండియా) జాతీయ అధ్యక్షు లు వినరు బాబు అన్నారు. ఆదివారం హనుమకొండలో యూనియన్‌ ఆధ్వర్యంలో పూర్వ ఖమ్మం, వరంగల్‌ జిల్లాలలోని డెవల ప్మెంట్‌ ఆఫీసర్‌ల వార్షిక సమావేశం నిర్వ హించారు. ముఖ్యఅతిథిగా వినరు బాబు పాల్గొని ప్రసంగించారు. ఎల్‌ఐసి మరింత వద్ధి చెందేలా పనిచేద్దామని అన్నారు. వచ్చే బడ్జెట్‌ లో జీవిత భీమా పరిమితిని రూ.250000 కి పెంచాలని, జీఎస్టీని తీసివేయాలని డిమాండ్‌ చేశారు. స్టాక్‌ మార్కెట్లో ఎల్‌ఐసి 42000 కోట్లు ఆర్జించిన విషయాన్ని ప్రజలు తెలుసుకో వాలని అన్నారు. స్టాక్‌ మార్కెట్‌ లో లాభ నష్టాల గురించి ఆందోళన లేదని అన్నా రు. ఈ కార్యక్రమంలో సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ సెక్రటరీ శివ ప్రసాద్‌ , జోనల్‌ కోశాధికారి శ్రీనివాస్‌ , వరంగల్‌ డివిజన్‌ నాయకులూ ఉపేందర్‌ , రోహన్‌ రెడ్డి , మారుతీ రాజు తదితరులు పాల్గొన్నారు.

Spread the love