వీరశైవ లింగాయత్‌లను ఓబీసీ జాబితాలో చేర్చాలి

– బీసీలకు అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో50 శాతం రిజర్వేషన్‌ కల్పించాలి
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు,
– ఎంపీ ఆర్‌ కృష్ణయ్య
నవతెలంగాణ-ముషీరాబాద్‌
వీరశైవ లింగాయత్‌ సామాజిక వర్గాన్ని ఓబీసీ జాబితాలో చేర్చి రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ పార్లమెంట్‌ స్థానాలలో 50 శాతం రిజర్వేషన్లు బీసీలకు కల్పించాలని ప్రభుత్వాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్‌ కష్ణయ్య డిమాండ్‌ చేశారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర వీరశైవ లింగాయత్‌ లింగ బలిజ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు. రాష్ట్రంలో బీసీ జాబితాలో ఉన్న వీరశైవ లింగాయతులను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్‌ చేస్తూ కేంద్ర ప్రభుత్వ దృష్టికి జాతీయ బీసీ కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లగా వారు సానుకూలంగా స్పందించారు కానీ ఇంతవరకు జాబితాలో చేర్చలేదన్నారు. వీరశైవ లింగాయతులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి రూ. 500 కోట్ల బడ్జెట్‌ కేటాయించాలని డిమాండ్‌ చేశారు అన్ని రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాం కుగా వాడుకుంటూ రాజ్యాధికారంలో వాటా ఇవ్వకుండా 75 సంవత్సరాలుగా అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. బీసీ జనాభా ప్రకారం రిజర్వేషన్లను విద్యా ఉద్యోగ రంగాలలో స్థానిక సంస్థలు ఎన్నికలలో 27 శాతం నుంచి 50 శాతం పెంచాలని, చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్‌ చేశారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజ ర్వేషన్‌ కల్పించాలని కోరారు. ఇటీవల చత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ ప్రభు త్వాలు రిజర్వేషన్లను 70 శాతానికి పెంచినట్టు తెలంగాణ ప్రభు త్వం కూడా 29 శాతం నుంచి 52 శాతానికి పెంచాలన్నారు. కేంద్రంలోని 72 ప్రభుత్వ శాఖల్లో 2005 నుంచి ప్రభుత్వం 16 లక్షల ఖాళీలు పెండింగ్‌లో పెడుతున్నదని వాటిని వెంటనే భర్తీ చేయాలన్నారు. బీసీల విద్య ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రిమిలే యర్‌ ను తొలగించాలని, పరిశ్రమకు పాలసీలో 50 శాతం కోటా ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ గుజ్జ కష్ణ, వీరశైవ లింగాయత్‌ రాష్ట్ర అధ్యక్షులు వెన్న ఈశ్వరప్ప, గౌరవ అధ్యక్షులు సంగమేశ్వర్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివకుమార్‌, రాజప్ప, భరత్‌ కుమార్‌, లక్ష్మీ సోమశేఖర్‌, మల్లికార్జున్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love