తెలంగాణ లో మరాఠలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది..

– మమతా సంతోష్ గుప్తా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరాఠాలు బిఆర్ఎస్ లో పార్టీలో చేరిక..
– రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
సీఎం కేసీఆర్  అందిస్తున్న సంక్షేమ పథకాలకు  ఆకర్షితులై తెలంగాణ మరాఠాలు బిఆరెస్ పార్టీలో చేరారు. ఆదివారం గోషామహల్ నియోజకవర్గంలోని జాంబాగ్ వివి ఫంక్షన్ హాల్ లో బిఆర్ ఎస్ పార్టీ నాయకురాలు మమతా సంతోష్ గుప్తా ఆధ్వర్యంలో  తెలంగాణ మరాఠా ఏక్తా మంచ్ నాయకులు, కార్యకర్తలు వందలాదిగా ర్యాలీతో తరలివచ్చి నా మరాఠాలకు కండువా కప్పి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలను అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు.దేశంలో ఎక్కడలేని అనేక సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నారని చెప్పారు. గోషామహల్ లో అనేక వర్గాలవారు ఉన్నారనివారికి  రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా అదుకుంటుంది అన్నారు.రానున్న ఎన్నికల్లో గోషామహల్ లో బిఆరెస్ కు మద్దతిచి గెలిపించాలని మరాఠా లను మంత్రి కోరారు.75సంవత్సరాల భారత స్వతంత్రం లో బిజెపి,కాంగ్రెస్ లు చేయని అభివృద్ధి నీ సీఎం కేసీఆర్  9 ఏళ్లలోనే తెలంగాణను అభివృద్ధి చేశారని తెలిపారు.ఇతర రాష్ట్రాలనుండి వచ్చిన వాళ్ళను కూడా తన బిడ్డలుగా చూసుకుంటున్నా ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్.రానున్న రోజుల్లో బిఆర్ ఎస్ ను గెలిపించాలన్నారు. రాష్ట్రంలో 24గంటల కరెంటు సీఎం కేసీఆర్ అందిస్తున్నారని చెప్పారు. పార్టీలోకి వచ్చిన మరాఠీ ల సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గోషామహల్ బిఆర్ ఎస్ ఇంచార్జి నంద కిషోర్ వ్యాస్. తెలంగాణ ఉద్యమకారుడు ఆర్ వి మహేందర్ కుమార్. సంతోష్ గుప్తా.  అలాపురుషోత్తం రావు. ముత్యాల గోవిందరాజ్. తెలంగాణ మరాఠా ఏక్తా మచ్ అధ్యక్షులు సునీల్ దావ్ పటేల్. ఆనంద్ బి రాధ, దిలీప్ ఘనాటే, శ్రీనివాస్ గౌడ్, సురేష్ ముదిరాజ్, రామ్ చందర్ రాజ్, వినోద్ యాదవ్, ముకేష్ ముదిరాజ్, వరుణ్ దాయనంద్ గుప్తా, పి.నగరాజ్, యాదవ్, సంతోష్ గుప్తా, జై షేంకర్, రెక్కీ శెట్టి రమేష్, అనిత పెద్ద ఎత్తున మరాఠాలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love