200 మంది ఉద్యోగులను తొలగించిన గూగుల్‌!

నవతెలంగాణ – న్యూఢిల్లీ: టెక్‌ దిగ్గజం, ప్రముఖ సెర్చ్‌ఇంజిన్‌ గూగుల్‌లో ఉద్యోగుల తొలగింపు కొనసాగుతున్నది. కాస్ట్‌ కటింగ్‌ పేరుతో పైథాన్‌ టీమ్‌ మొత్తాన్ని ఎత్తేసిన గూగుల్‌ తాజాగా సుమారు 200 మందిపై వేటువేసింది. వీరంతా కోర్ టీమ్‌లో సభ్యులని, గత నెల 25కు ముందే వీరందరిని తొలగించినట్లు ఓ నివేదిక పేర్కొంది. వీరిలో కాలిఫోర్నియా, సన్నీవేల్‌లోని ఆఫీసుల్లోని ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన ఉద్యోగులు కూడా ఉన్నారని తెలిపింది. అమెరికా వెలుపల చౌకగా ఉద్యోగులు లభిస్తుండటంతో ఈ పోజిషన్లను భారత్‌, మెక్సికోకు బదిలీ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే పైథాన్‌, ఫ్లుట్టర్‌, డార్ట్‌లపై పనిచేసే బృందాల్లోని చాలా మంది ఉద్యోగులను గూగుల్‌ కంపెనీ తొలగించింది. వారికి కంపెనీలోనే ఇతర ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించామని గూగుల్‌ అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.

Spread the love