నవతెలంగాణ – హైదరాబాద్: ఐపీఎల్ మెగా టోర్నీ 2024 లో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్లు జరగనున్నాయి. శనివారం హాలిడే కావడంతో ప్రతి సారి రెండు మ్యాచ్ లు నిర్వహిస్తోంది ఐపీఎల్ యాజమాన్యం. ఇక ఇవాళ మొదట 4 గంటలకు పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ చండీగఢ్ లో జరుగుతుంది. ఇక హైదరాబాద్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ కలకత్తాలో జరగనుంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి లో ఉన్నారు. హాలిడే కావడంతో ఇంట్లోనే మ్యాచులు చూసి ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారు.