
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు పథకాలను ప్రజల్లో అవగాహన పెంచేందుకు శనివారం మండల వ్యాప్తంగా అన్ని క్లస్టర్ల పోలింగ్ బూతుల పరిధిలో నాయకులు గడపగడపకు కాంగ్రెస్ పేరుతో విస్తృత ప్రచారం నిర్వహించారు. పసర క్లస్టర్ లో పిఎసిఎస్ చైర్మన్ పన్నాల ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. పసర గ్రామంలో వార్డు సభ్యునికి, మరియు అంగన్వాడి టీచర్ కు గృహలక్ష్మి వర్తింపచేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. మండల కేంద్రంలో పార్టీ మండల అధ్యక్షుడు పాలడుగు వెంకటకృష్ణ ఆధ్వర్యంలో స్థానిక నాయకులతో కలిసి ఆరు పథకాలను వివరిస్తూ ప్రజలకు అవగాహన పెంచుతూ అవకాశం కల్పించాలని కోరారు. చల్వాయిలో ఉప సర్పంచ్ తెల్ల ప్రసాద్ ఎంపీటీసీ చాపల ఉమాదేవి జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు కిషన్ రెడ్డి కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు పూర్ణ చందర్ తదితరులు గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు.